India's Population: 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనున్న భారత జనాభా, విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023 నివేదికలో షాకింగ్ విషయాలు

భారతదేశ జనాభా 2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023' నివేదిక చెబుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది.

World-Population Representative Image (Photo Credits: Pixabay)

భారతదేశ జనాభా  2036 నాటికి 152.2 కోట్లకు చేరుకోనుందని కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023' నివేదిక చెబుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 48.5 శాతంగా ఉన్న మహిళల జనాభా 2036 నాటికి కాస్త మెరుగుపడి 48.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది. 2011తో పోలిస్తే 2036లో 15 ఏళ్ల వయస్సు కంటే తక్కువ ఉన్న వారి నిష్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది. సంతానోత్పత్తి క్షీణతే ఇందుకు కారణంగా పేర్కొంది.

60 ఏళ్లు, అంతకు పైబడినవారి జనాభా నిష్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. 2011తో పోలిస్తే 2036 జనాభాలో మహిళల నిష్పత్తి కాస్త పెరుగుతుందని వెల్లడించింది. 2011లో 943గా ఉన్న మహిళల నిష్పత్తి 2036లో 952కు చేరుకోనుందని వెల్లడించింది. 2016 నుంచి 2020 వరకు 20-24 ఏళ్ల వారిలో సంతానోత్పత్తి శాతం 135.4 శాతం నుంచి 113.6 శాతానికి, 25-29 ఏళ్లున్న వారిలో 166 శాతం నుంచి 139.6 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 35-36 ఏళ్ల వయస్సు వారిలో 32.7 శాతం నుంచి 35.6 శాతానికి తగ్గింది. జీవితంలో స్థిరపడిన తర్వాతే సంతానం గురించి ఆలోచిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా ఈ నివేదిక తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఇదిగో, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్

2020లో కౌమార సంతానోత్పత్తి రేటు నిరక్షరాస్యుల్లో 33.9 శాతం కాగా, అక్షరాస్యుల్లో 11 శాతంగా ఉంది. శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతున్నట్లు పేర్కొంది. ఎప్పుడూ మగ పిల్లల కంటే ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ 2020కి వచ్చేసరికి ప్రతి 1000 మందిలో 28 మరణాలతో ఆడ, మగ సమానంగా నమోదయ్యాయి. 5 ఏళ్ల లోపు పిల్లల మరణాలు 2015లో 43గా ఉండగా, 2020 నాటికి 32కి తగ్గింది. డీపీఐఐటీ 2016 నుంచి 2023 వరకు 1,17,254 స్టార్టప్‌లను గుర్తించింది. ఇందులో 55,816 స్టార్టప్‌లకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం గుర్తింపు పొందిన వాటిలో 47.6 శాతం మహిళలు ఉన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now