Gym Trainer Dies: మెడపై 210 కిలోల బార్బెల్ పడి జిమ్ ట్రైనర్ జ‌స్టిన్ విక్కీ మృతి.. ఇండోనేషియాలోని బాలిలో ఘటన.. వీడియో వైరల్

ఇదో విషాదకరమైన ఘటన. తాను లిఫ్ట్ చేస్తున్న వెయిట్ మీదప‌డ‌డంతో ఇండోనేషియాలోని బాలిలో ఫిట్‌నెస్ ట్రైన‌ర్ జ‌స్టిన్ విక్కీ (33) ప్రాణాలు కోల్పోయాడు. బార్బెల్ ఎత్తుతుండగా అదికాస్తా విక్కీ మెడ‌పై ప‌డ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు.

Gym Trainer Dies: మెడపై 210 కిలోల బార్బెల్ పడి జిమ్ ట్రైనర్ జ‌స్టిన్ విక్కీ మృతి.. ఇండోనేషియాలోని బాలిలో ఘటన..  వీడియో వైరల్
Credits: Twitter

Newdelhi, July 22: ఇదో విషాదకరమైన ఘటన. తాను లిఫ్ట్ చేస్తున్న వెయిట్ మీదప‌డ‌డంతో ఇండోనేషియాలోని (Indonesia) బాలిలో (Bali) ఫిట్‌ నెస్ ట్రైన‌ర్ జ‌స్టిన్ విక్కీ (Justyn Vicky) (33) ప్రాణాలు కోల్పోయాడు. బార్బెల్ ఎత్తుతుండగా అదికాస్తా విక్కీ మెడ‌పై ప‌డ‌డంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 15న జ‌రిగిందీ ఘ‌ట‌న‌. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

Road Accident in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి వరుసగా ఢీకొన్న నాలుగు వాహనాలు.. డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు.. వీడియోతో

దెబ్బతిన్న న‌రాల వ్య‌వ‌స్థ

స్క్వాట్‌ప్రెస్ కోసం విక్కీ 210 కేజీల బ‌రువున్న‌ బార్బెల్‌ను ఎత్తి త‌న భుజాల‌పై పెట్టుకున్నాడు. అయితే, అంత బ‌రువును కాయడంలో బ్యాలెన్స్ కోల్పోయి వెనక్కి పడ్డాడు. దీంతో బార్బెల్ అత‌డి మెడ‌పై ప‌డింది. దీంతో మెడ విరిగి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌డి గుండె, కాలేయానికి సంబంధించిన న‌రాల వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. విక్కీని వెంట‌నే ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. అక్క‌డాయ‌నకు అత్య‌వ‌స‌ర ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. అయితే, ఆ త‌ర్వాత కాసేప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయాడు.

Rains Alert to Hyderabad: రానున్న 12 గంటల్లో హైదరాబాద్‌ లో భారీ వర్షం.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వానలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారుల హెచ్చరిక.. ప్రమాదకరస్థాయికి హుస్సేన్ సాగర్

(The above story first appeared on LatestLY on Jul 22, 2023 09:27 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).