Bhadradri Kothagudem, July 22: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జూలూరుపాడు శివారులో ఖమ్మం – కొత్తగూడెం (Khammam-Kothagudem) రహదారిపై నాలుగు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. రోడ్డుపై ఆపిన లారీని వెనకనుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో ఆ లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కున్నాడు. అతన్ని రక్షించేందుకు మరో లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి అటువైపుకు వెళ్లాడు. వెంటనే నిలిపి ఉన్న ఆ లారీని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు చెలరేగాయి. దీంతో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుంది. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం..!
Watch Video >>>https://t.co/t5JIIoyiTF#bhadradri #kothagudem #RoadAccident #NTVTelugu #NTVNews
— NTV Telugu (@NtvTeluguLive) July 22, 2023
మద్యంతో మొదలైంది ఇలా..
ఓ లారీ కొత్తగూడెం వైపు వెళ్తోంది. కొంతమంది మద్యం సేవించి ఎదురుగా రోడ్డుపై కారు నిలిపారు. లారీ డ్రైవర్ కారును తొలగించాలని కోరాడు. ఇంతలో నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీ క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని రక్షించేందుకు మరో లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపి అటువైపుకు వెళ్లాడు. వెంటనే నిలిపి ఉన్న ఆ లారీని మరో వాహనం ఢీకొట్టింది. దీంతో లారీ డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. డ్రైవర్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.