Hussain Sagar (Credits: Twitter)

Hyderabad, July 22: తెలంగాణవ్యాప్తంగా (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజులుగా రాజధాని హైదరాబాద్ (Hyderabad) వర్షాలతో తడిసి ముద్దవుతుంది. రానున్న 12 గంటల్లో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేడ్చల్ (Medchal), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల పరిధిలోనూ వర్షానికి అవకాశముందని, ఈ మూడు జిల్లాల ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

IMD Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, వచ్చే 5 రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ప్రమాదకరంగా హుస్సేన్ సాగర్

నగరంలో, పరిసరప్రాంతాల్లో గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీ వరద నీరు వస్తోంది. దీంతో సాగర్ లో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి చేరింది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ ను దాటింది. ఫుల్ ట్యాంక్ లెవ‌ల్ సామ‌ర్థ్యం 513.45 మీట‌ర్లు కాగా, 514.75 మీట‌ర్లను దాటింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.

గోదావరి నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జలమండలి తాగునీటి సరఫరా, నాణ్యతపై దృష్టి సారించింది. నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది.