Karnataka Crime: భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చిన మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్, చివరకు ఏం జరిగిందంటే..

భర్తతో గొడవలు ఉన్నాయని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళ చివరకు ఆ స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

Representational Image | (Photo Credits: PTI)

మైసూరు, ఫిబ్రవరి 26: భర్తతో గొడవలు ఉన్నాయని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ మహిళ చివరకు ఆ స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్‌కు వస్తే ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఒక కానిస్టేబుల్. కర్ణాటక లోని నంజనగూడు తాలుకా హుల్లహళ్ళి పోలీసు స్టేషన్ లో సి.కృష్ణ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అతను టి.నరసిపుర తాలూకా బన్నూరు పోలీసు స్టేషన్ లో పని చేసే సమయంలో గౌరమ్మ అనే మహిళ భర్త నంజయ్యతో విభేదాలు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటానికి స్టేషన్ కు వచ్చింది.

Corona in AP: ఏపీలో కొత్తగా 280 మందికి కరోనా, 4,709 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స

ఆమె వద్ద ఫిర్యాదు తీసుకున్న అనంతరం కృష్ణ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కృష్ణ మాటలు నమ్మిన గౌరమ్మ భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమెను మాయమాటలతో లోబరుచుకుని మైసూరులో కాపురం పెట్టాడు. ఆమె పేరుమీద సోసైటీలో రూ. 5లక్షల లోన్ తీసుకున్నాడు. విడిగా మరో రూ.3 లక్షలు లోన్ తీసుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె పెళ్లి చేసుకోమని కృష్ణను కోరగా అందుకు అతడు అంగీకరించలేదు. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని… తాను చెప్పినట్లు వినకపోతే కష్టాలు తప్పవని బెదిరించాడు. ఇటీవల కృష్ణ, అతని కుమారుడు కిరణ్ కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి పోలంలో పడేశారు. ఆమెను గమనించిన స్ధానికులు మైసూరులోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె హుల్లహుళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement