Tamil Rockers: కొత్త సినిమాలను పైరసీ చేసే తమిళ్ రాకర్స్ కు షాక్.. అడ్మిన్ ను అత్యంత చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు.. ‘రాయన్’ సినిమాను సెల్ ఫోన్ తో రికార్డు చేస్తుండగా అరెస్ట్
ఎంత భారీ సినిమా అయినా సరే.. థియేటర్ లో విడుదల కాగానే, ఇంకా లోతుగా చెప్పాలంటే కొన్ని సినిమాలు విడుదల కాకముందే పైరసీ చేసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసే ‘తమిళ్ రాకర్స్’ కు కేరళ పోలీసులు షాకిచ్చారు. తమిళ్ రాకర్స్ గ్రూపు అడ్మిన్ స్టీఫెన్ రాజ్ ను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు.
Newdelhi, July 29: ఎంత భారీ సినిమా అయినా సరే.. థియేటర్ లో విడుదల కాగానే, ఇంకా లోతుగా చెప్పాలంటే కొన్ని సినిమాలు విడుదల కాకముందే పైరసీ చేసి ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసే ‘తమిళ్ రాకర్స్’ (Tamil Rockers)కు కేరళ పోలీసులు (Kerala Police) షాకిచ్చారు. తమిళ్ రాకర్స్ గ్రూపు అడ్మిన్ స్టీఫెన్ రాజ్ ను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేశారు. కేరళలోని తిరువనంతపురంలోని ఓ థియేటర్ లో ధనుష్ నటించిన ‘రాయన్’ సినిమాను సెల్ ఫోన్ లో రికార్డు చేస్తుండగా ఆదివారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఆ సినిమా ఏ థియేటర్ లో రికార్డు అయ్యిందో తెలుసుకునేందుకు ఎండ్ టు ఎండ్ డిజిటల్ సినిమా టెక్నాలజీ, సొల్యూషన్ అందించే ‘క్యూబ్ డిజిట్’ను సంప్రదించారు. అయితే ఆ థియేటర్ లోపల సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరు రికార్డు చేశారో గుర్తించలేకపోయారు. దీంతో పైరసీ వీడియో రికార్డయిన యాంగిల్ (కోణం) ఆధారంగా ఏ సీటు నుంచి చిత్రీకరించారో టికెట్ బుకింగ్ హిస్టరీ ప్రకారం పోలీసులు కచ్చితంగా గుర్తించారు.
ఆ ఫిర్యాదుతో ముందుకు..
మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించిన ‘గురువాయూర్ అంబలనడైయిల్’ అనే మలయాళ సినిమా విడుదలైన రోజునే పైరసీ అయ్యింది. వెబ్ సైట్ తో పాటు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ సినిమా చక్కర్లు కొట్టింది. దీంతో సినిమా నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలా చివరకు ‘రాయన్’ సినిమా ద్వారా నిందితుడిని పట్టుకున్నారు.
ఉచిత బస్సులో ఖాళీగా ప్రయాణించడం ఎందుకని.. బ్రష్ చేసుకున్న మహిళ.. నెట్టింట వీడియో వైరల్
(The above story first appeared on LatestLY on Jul 29, 2024 09:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

