Hyderabad, July 29: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది. తొలుత విపరీతంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్న మహిళలు.. గతంలో కొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. అలా వార్తల్లో నిలిచిన టీజీఆర్టీసీ ఇప్పుడు ఒక మహిళ చేసిన పనితో మరోసారి చర్చనీయాంశమైంది. బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న ఓ మహిళ ఖాళీగా ఉండటం ఎందుకని అనుకున్నదో ఏమో? లేక ఊరెళ్ళే తొందరలో పండ్లు తోముకోవడం మర్చిపోయిందో గానీ.. ఏకంగా కదులుతున్న బస్సులోనే బ్రష్ చేసుకొంటూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన ఏ డిపో పరిధిలో చోటు చేసుకుందో ఇంకా తెలియలేదు. అయితే, ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బస్సులో బ్రష్ చేస్తూ ప్రయాణిస్తున్న మహాలక్ష్మి pic.twitter.com/j56bMn3UO4
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2024
గతంలో ఇలా..
ఉచిత బస్సుల్లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఓ బస్సులో ఇద్దరు మహిళలు ఊరికే ఎందుకు కూర్చోవాలనుకున్నారో ఏమోగానీ.. బస్సులో ప్రయాణిస్తూనే బీడీలు చుడుతూ కనిపించారు. మరో మహిళ కూరగాయలు తరుగుతూ దర్శనమిచ్చారు. అప్పట్లో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.