Lonavala Waterfall Mishap: లోనావాలాలోని భూషి డ్యామ్‌ లో కొట్టుకుపోయి ఐదుగురు మృతి.. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే.. భయానక వీడియో వైరల్

మహారాష్ట్రలోని లోనావాలాలో ఘోరం జరిగింది. భూషి డ్యామ్‌ వెనుక భాగంలో ఉన్న జలపాతం ప్రవాహంలో ఫోటోల కోసం దిగిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు.

Lonavala Waterfall Mishap: లోనావాలాలోని భూషి డ్యామ్‌ లో కొట్టుకుపోయి ఐదుగురు మృతి.. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారే.. భయానక వీడియో వైరల్
Lonavala waterfalls mishap (Credits: X)

Newdelhi, July 1: మహారాష్ట్రలోని (Maharastra) లోనావాలాలో (Lonavala Waterfall Mishap) ఘోరం జరిగింది. భూషి డ్యామ్‌ వెనుక భాగంలో ఉన్న జలపాతం ప్రవాహంలో ఫోటోల కోసం దిగిన  ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. లోనావాలాలో రెండు రోజుల నుంచి భారీ వర్షం కురుస్తున్నది. జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుండగా..ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో ఐదుగురు పర్యాటకులు డ్యామ్‌ లోకి కొట్టుకుపోయారు. కాగా తాజాగా ఐదుగురూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను దవాఖానకు తరలించనున్నట్టు పేర్కొన్నారు.

ఒకటో తారీఖు వచ్చింది... గ్యాస్ సిలిండర్ ధర మారింది... కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.30 మేర తగ్గింపు..

సాయం కోసం అర్థిస్తూ..

నీటి ఉదృతి పెరుగడంతో.. భయానికి లోనైన కుటుంబం.. కొట్టుకుపోతూ కూడా ఒకరినొకరు పట్టుకొని సహాయం కోసం అందరినీ అర్థించారు. ఈ హృదయ విదారకర దృశ్యం సోషల్‌ మీడియాలో కనిపించాయి. ప్రమాదానికి సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది.

ఎన్నికల ముందు జగన్ సర్కారు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు, జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, టెట్ నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం

(The above story first appeared on LatestLY on Jul 01, 2024 08:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).