Free Tomato Offer: విచిత్ర ఆఫర్.. స్మార్ట్‌ ఫోన్‌ కొంటే రెండు కిలోల టమాటాలు ఉచితం.. మధ్యప్రదేశ్‌ లో సెల్‌ ఫోన్ షాపు యజమాని ప్రకటన

దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా రేట్లను తమకు అనుకూలంగా వాడుకుంటూ సేల్స్ పెంచుకునే ఆలోచన చేస్తున్నారు వ్యాపారాలు. ఇదీ అలాంటి ఘటనే.

Free Tomato Offer: విచిత్ర ఆఫర్.. స్మార్ట్‌ ఫోన్‌ కొంటే రెండు కిలోల టమాటాలు ఉచితం.. మధ్యప్రదేశ్‌ లో సెల్‌ ఫోన్ షాపు యజమాని ప్రకటన
Tomato (Representational Image; Photo Credit: Twitter/ @ANI)

Hyderabad, July 9: దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా రేట్లను (Tomato Rates) తమకు అనుకూలంగా వాడుకుంటూ సేల్స్ (Sales) పెంచుకునే ఆలోచన చేస్తున్నారు వ్యాపారాలు. ఇదీ అలాంటి ఘటనే. ఒక స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) తో రెండు కిలోల టమాటాలు ఉచితమంటూ ప్రత్యేక ఆఫర్ (Special Offer) ప్రకటించి జనం దృష్టిని ఆకర్షించాడు ఓ సెల్‌ఫోన్ షాపు యజమాని. మధ్యప్రదేశ్‌ లోని అశోక్‌నగర్‌ కు చెందిన అశోక్ అగర్వాల్‌ ఈ ఆఫర్ ప్రకటించారు. తన ప్రకటనకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు అశోక్ తెలిపాడు. వ్యాపారం కూడా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు.

Swarnalatha Suspension: విశాఖ నోట్ల మార్పిడి కేసు.. ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు.. కానిస్టేబుల్‌ హేమసుందర్‌పైనా వేటు.. నిందితులు నలుగురికీ ఈ నెల 21 వరకు రిమాండ్

యూపీలో కూడా..

ఇటీవల యూపీకి చెందిన ఓ సెల్ ఫోన్ షాప్ యజమాని కూడా మొబైల్ కొంటే కిలో టమాటా ఫ్రీగా ఇస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Ujjaini Mahakali Bonalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం.. వీడియో ఇదిగో

(The above story first appeared on LatestLY on Jul 09, 2023 09:29 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).