swarnalatha (Credits: Twitter)

Visakhapatnam, July 9: లెక్కకు మించిన ట్విస్ట్ లతో (Twists) ఓ మిస్టరీ థ్రిల్లర్ (Thriller) ను తలపించేలా తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) సంచలనం సృష్టించిన విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో ఏ4 నిందితురాలైన ఏఆర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత (Swarnalatha), కానిస్టేబుల్ హేమసుందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే, వీరిద్దరితోపాటు హోంగార్డు వి.శ్రీను, మధ్యవర్తిగా వ్యవహరించిన సూరిబాబుకు కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించడంతో నిన్న వారిని నగరంలోని సెంట్రల్ జైలుకు తరలించారు.

Ujjaini Mahakali Bonalu: అంగరంగ వైభవంగా ప్రారంభమైన లష్కర్‌ బోనాలు.. తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబం.. వీడియో ఇదిగో

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వానలు.. తెలంగాణలో నేడు, రేపు.. ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం

రేపు విచారణకు

స్వర్ణలత పెట్టుకున్న బెయిల్ దరఖాస్తు రేపు విచారణకు రానుంది. కాగా, ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న స్వర్ణలత డ్యాన్స్‌ లో శిక్షణ కోసం ఓ కొరియోగ్రాఫర్‌ను పెట్టుకుని శిక్షణ తీసుకుంటోంది. ఈ సందర్భంగా చిరంజీవి పాటకు డ్యాన్స్ చేసిన ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. ఆమె గురించి వార్తలు వచ్చిన తర్వాత ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

KTR Fire On Modi: మోదీలా అబద్దాలు ఆడాలంటే చాలా ధైర్యం కావాలి! ఉపన్యాసం ఇవ్వడం...ఉత్తచేతులతో వెళ్లడం మోదీకి అలవాటే అంటూ ఫైరయిన మంత్రి కేటీఆర్