Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వానలు.. తెలంగాణలో నేడు, రేపు.. ఏపీలో నేడు, రేపు, ఎల్లుండి వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.. నిన్న హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Hyderabad, July 9: వచ్చే మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాలను (Telugu States) వానలు ముంచెత్తనున్నాయి. తెలంగాణలో (Telangana) నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కూడా హైదరాబాద్ (Hyderabad) సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 4.3 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా లక్ష్మీనగర్, ములుగు జిల్లా మల్లంపల్లిలో 3.8 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు.
ఏపీలోనూ..
అటు ఏపీలోనూ వచ్చే మూడు రోజులు అనగా నేడు, రేపు, ఎల్లుండి వరకూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాలలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Jul 09, 2023 08:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

