Mumbai, July 28: ముంబైలోని (Mumbai) సెవ్రి రైల్వే స్టేషన్ లో నడుస్తున్న రైలుకు వేలాడుతూ ఫర్హాత్ అజామ్ షేక్ ( Farhat Azam Shaikh ) అనే యువకుడు ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు. అతడి స్టంట్స్ కి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన పోలీసులు అతడికి ఎలాగైనా హెచ్చరికలు చేద్దామని యువకుడి ఇంటికి వెళ్లాడు. అయితే, ఒక కాలు, చెయ్యి పోగొట్టుకొని ఫర్హాత్ దీనంగా ఉండటంతో పోలీసులు షాక్ కి గురయ్యారు.
ట్రైన్తో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ కాలు, చేయి పోగొట్టుకున్న యువకుడు
ముంబై - సెవ్రీ రైల్వే స్టేషన్లో గత నెల ఫర్హాత్ ఆజమ్ షేక్ అనే యువకుడు కదులుతున్న రైలుని పట్టుకొని జారుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో పోలీసుల దృష్టికి వెళ్లగా కేసు నమోదు… pic.twitter.com/E9jJFJjXm8
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2024
షాక్ అయ్యి.. అరెస్ట్ వద్దని
గత ఏప్రిల్ 14న మసీద్ వద్ద సదరు యువకుడు మరో స్టంట్ చేసేటప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదంలో అతని ఎడమ చేయి, కాలు కోల్పోయాడు. అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి అతన్ని అరెస్ట్ చేయలేకపోయామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( Railway Protection Force ) అధికారి తెలిపారు. గాయపడిన ఫర్హాత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు.ఎవరూ కూడా తన లాగా స్టంట్స్ చేయవద్దని అభ్యర్థించాడు.