TG New Governor Jishnu Dev Varma

Newdelhi, July 28: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ వర్గాలు శనివారం రాత్రి  తెలిపాయి. తెలంగాణ గవర్నర్‌ గా జిష్ణు దేవ్‌ వర్మ ను (Jishnu Dev Varma) నియమించారు. రాజస్థాన్‌  గవర్నర్‌ గా హరిబౌ కిషన్‌ రావు బాగ్డేను, సిక్కిం గవర్నర్‌ గా ఓమ్‌ ప్రకాశ్‌ మాథూర్‌, జార్ఖండ్‌ గవర్నర్‌ గా సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ గా రామెన్‌ దేకా, మేఘాలయా గవర్నర్ గా సీహెచ్‌ విజయ్‌ శంకర్‌ నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్‌ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్‌.. మహారాష్ట్ర గవర్నర్‌ గా నియమితులయ్యారు. అస్సాం గవర్నర్‌ గా ఉన్న గులాబ్‌ చంద్‌ కటారియా.. పంజాబ్‌ గవర్నర్‌ గా, చంఢీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌ గా నియమితులయ్యారు. సిక్కిం గవర్నర్‌ గా ఉన్న లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య.. అస్సాం గవర్నర్‌ గా నియమితులయ్యారు. లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్యకు మణిపూర్‌ గవర్నర్‌ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9.15 వ‌ర‌కు కొన‌సాగిన తెలంగాణ అసెంబ్లీ, అంశాల వారీగా అధికార ప‌క్షానికి హ‌రీష్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

ఎవరీ జిష్ణుదేవ్‌ వర్మ?

తెలంగాణ గవర్నర్‌ గా (TG New Governor) నియమితులైన జిష్ణుదేవ్‌ వర్మ.. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఇంచార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

కోమటిరెడ్డిది హాఫ్ నాలెడ్జ్, హరీష్ ఆకారం పెరిగింది తప్ప తెలివి పెరగలే?, కోమటిరెడ్డి వర్సెస్ హరీష్..డైలాగ్ వార్