Newdelhi, July 23: సహోద్యోగుల అవినీతిని (Corruption) చూసి నిజాయితీ గల ఓ హోంగార్డు (Home Guard) తట్టుకోలేకపోయారు. దీంతో హైవేపై (Highway) నిరసనకు (Protest) దిగారు. పంజాబ్‌లోని (Punjab) జలంధర్ లో (Jalandhar) తాజాగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. హోంగార్డు నిరసనతో అక్కడ కాసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. ‘నేను ఎంతో కష్టపడి దొంగలను అరెస్టు చేస్తే మా పోలీస్ స్టేషన్ లోని వాళ్లు లంచం తీసుకుని వదిలేస్తున్నారు’ అంటూ భోగ్‌పూర్ ప్రాంతంలో పఠాన్ కోట్ హైవేపై హోంగార్డు నిరసనకు తెరలేపారు. తొలుత ఆ హోంగార్డు రహదారికి అడ్డంగా ఓ తాడు కట్టి ట్రాఫిక్ వెళ్లేందుకు మార్గం లేకుండా చేస్తూ నిరసనకు దిగారు. మరో పోలీసు అతడిని అడ్డుకోవడంతో ఈమారు రోడ్డుపై బస్సుకు అడ్డంగా పడుకున్నారు. ఈ క్రమంలో అతడిని మరో పోలీసు కాలితో తన్నాడన్న ఆరోపణ కూడా సంచలనం కలిగిస్తోంది.
‘Jehra mai chor fad ke liauna oh Thane Wale paise laike chadi jande’
रिश्वतखोरी से दुखी हो कर पुलिस मुलाजिम ने #jalandhar के भोगपुर में रोड जाम कर विरोध प्रदर्शन किया। #PunjabPolice pic.twitter.com/QyajO37Cvd
— Harpinder Singh (@HarpinderTohra) July 22, 2023
ఇంచార్జ్ స్పందన ఏంటంటే?
హోంగార్డు ఆరోపణలపై భోగ్‌పూర్ స్టేషన్ ఇంచార్జ్ స్పందించారు. ఓ వివాదానికి సంబంధించి హోంగార్డు ఓ యువకుడిని అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకొచ్చాడని, అయితే అతడిని బెయిల్‌పై విడుదల చేశామని చెప్పారు.