Tirumala, July 23: కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల (Tirumala) వెంకటేశ్వరస్వామిని దర్శించేందుకు రోజూ లక్షలాది మంది ఉవ్విళ్ళూరుతుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునే వెంకన్నస్వామి అత్యంత సంపన్నుడు అని తెలిసిందే. హుండీ రూపేణా ఆయనకు నిత్యం కోట్లలో ఆదాయం లభిస్తుంది. కాగా, స్వామివారికి ఎంతటి ఆస్తి ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ-TTD) తాజాగా వెల్లడించింది. వారణాసిలో (Varanasi) జరిగిన అంతర్జాతీయ ధార్మిక సమావేశంలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి (EO Dharmareddy) తిరుమల శ్రీవారి ఆస్తులు, ఇతర నిర్వహణ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంచుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు వెల్లడించిన టీటీడీ. #AndhraPradesh #tirumala #ttd #Assets https://t.co/rIpM6IoSF5
— News18 Telugu (@News18Telugu) July 23, 2023
శ్రీవారి ఆస్తుల వివరాలు ఇవిగో..
- తిరుమల వెంకటేశ్వరస్వామి వారి పేరిట బ్యాంకులో రూ.17 వేల కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి.
- బ్యాంకులో 11 టన్నుల బంగారం డిపాజిట్లు ఉన్నాయి.
- శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాల బరువు 1.2 టన్నులు.
- వెండి ఆభరణాల బరువు 10 టన్నులు.
- టీటీడీ పరిధిలో 600 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది.
- టీటీడీలో 24,500 మంది ఉద్యోగులు ఉన్నారు.
- శ్రీవారి సన్నిధిలో భక్తులకు సేవలు అందించే ఉద్యోగుల సంఖ్య 800.
- స్వామివారికి ప్రతి ఏడాది 500 టన్నుల పుష్పాలతో అలంకరణ.
- ఆలయంలో ప్రసాదాల తయారీ కోసం ప్రతి సంవత్సరం 500 టన్నుల నెయ్యి వినియోగం.
- టీటీడీ కింద దేశవ్యాప్తంగా 71 ఆలయాలు.
Viral Video: ఏపీలో దారుణం... మొదటి భార్య వీడియోలు చూస్తున్నాడని భర్త మర్మాంగం కోసిన రెండో భార్య