Lottery: లక్కీ ఫెలో అంటే ఇతనే.. టిక్కెట్ కొన్న గంటకే దక్కిన రూ. కోటి.. పంజాబ్ లో వెలుగు చూసిన ఘటన.. ఒక్కోటి రూ.6 చొప్పున 25 లాటరీ టిక్కెట్లు కొన్న బ్యాంకు ఉద్యోగి.. గంటకే తగిలిన జాక్ పాట్
ఊహించకుండానే కొన్నిసార్లు అదృష్టం తలుపు తడుతుందంటారు. ఇదీ అలాంటి సంఘటనే. లాటరీ టిక్కెట్ కొన్న గంటకే ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
Newdelhi, July 17: ఊహించకుండానే కొన్నిసార్లు అదృష్టం తలుపు తడుతుందంటారు. ఇదీ అలాంటి సంఘటనే. లాటరీ టిక్కెట్ (Lottery Ticket) కొన్న గంటకే ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. పంజాబ్‌లో (Punjab) తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన రూపీందర్ జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్ మెంట్ బ్యాంకులో క్లర్క్ గా (Bank Clerk) పనిచేస్తుంటారు. ఆయన ఏడాదిగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఆఫీసుకెళ్లి తన పనిలో..
శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే రూపీందర్ జిత్ సింగ్ నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు ఒక్కోటి రూ.6 పెట్టి 25 కొన్నారు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయారు. కానీ గంట తరువాత ఆయనకు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఏకంగా రూ. కోటి గెలుచుకున్నట్టు ఏజెంట్ చెప్పాడు. దీంతో, రూపీందర్ సంబరం అంబరాన్నంటింది. ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు.
(The above story first appeared on LatestLY on Jul 17, 2023 08:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

