Hyderabad, July 17: హైదరాబాద్ (Hyderabad) శివారులోని మరో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. రంగారెడ్డి జిల్లా (Rangareddy) షాద్ నగర్ (Shadnagar) నియోజకవర్గం బూర్గుల సమీపంలో గల శ్రీనాథ్ రోటో ప్యాక్ కంపెనీలో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరిని షాద్ నగర్‌లోని కమ్యూనిటీ ఆసుపత్రికి, మిగిలిన వారి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇంకా అదుపులోకి రాని మంటలు
కంపెనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రానట్టు తెలుస్తుంది.