Rains in Telugu States: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన.. నేటి నుంచి 20 వరకు వర్షాలు.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
నేటి నుంచి రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది.
Hyderabad, July 17: నేటి నుంచి రానున్న నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) భారీ వర్షాలు (Heavy Rains) పడనున్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ-IMD) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ లపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వెల్లడించింది. అదే సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితిలో కొనసాగుతోందని తెలిపింది. ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంపై (Bay of Bengal) మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో, తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన చేసింది.
ఐఎండీ సూచనలు ఇలా..
- జులై 17 నుంచి 20 వరకు- తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు
- జులై 18 నుంచి 20 వరకు- కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
- జులై 17 నుంచి 20 వరకు- కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
- జులై 17- తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
(The above story first appeared on LatestLY on Jul 17, 2023 07:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

