Water Level of River Yamuna (PIC@ ANI)

New Delhi, July 16: ఢిల్లీలో వరద ప్రభావిత ప్రజలకు ఆర్ధిక సాయం ప్రకటించింది కేజ్రీవాల్ (Kejriwal) ప్రభుత్వం. యమునానది పరివాహక ప్రాంతంలో వరద ప్రభావానికి గురైనవారికి (financial help to flood-affected families) రూ. 10వేలు ఆర్ధిక సాయం ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. అటు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులను పొడగించారు. సోమ, మంగళవారం కూడా సెలవులు (Holiday) పొడిగిస్తున్నట్లు చెప్పారు. వరదల కారణంగా సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, ఇతర అత్యవసర పత్రాలు పోగొట్టుకున్నవారికోసం ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు స్కూల్ విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్ కూడా అందిస్తామని తెలిపారు.

ఢిల్లీలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరద వచ్చింది. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది కుటుంబాలు ఢిల్లీని విడిచి సురక్షి ప్రాంతాలకు వెళ్లాయి. వందల సంఖ్యలో ఇండ్లు పాడయ్యాయి. దాంతో వారికి తక్షణ సాయంపై ఢిల్లీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వరద నష్టం అంచనా వేస్తోంది. బాధితులకు తక్షణ సాయం చేస్తోంది.