Wayanad, August 5: కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 387కు ( Death Toll Touches 387) చేరింది. ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంకా 180 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. వారి జాడ కోసం సహయక బృందాలు వెతుకుతున్నాయి.ఈనేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బీభత్సంలో (Wayanad Landslide) చాలా కుటుంబాలు.. తమ కుటుంబ సభ్యులను పొగొట్టుకున్నాయి. ఈ ఘటన చోటు చేసుకుని వారం రోజులవుతుంది. అయితే నేటికి తమ కుటుంబ సభ్యుల జాడ తెలియక పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఈ విపత్తులో 42 ఏళ్ల మన్సూర్.. తన 16 మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాడు. వారిలో అతడి తల్లి, భార్య, ఇద్దరు కుమారులు, సోదరితోపాటు వదిన కుటుంబంలోని 11 మంది విగత జీవులుగా మారారు. అయితే అతడి కుటుంబానికి చెందిన నాలుగు మృతదేహాలే ఇప్పటి వరకు లభించాయి. దీంతో మిగిలిన వారి మృతదేహాలను సైతం గాలించాలని ఆర్మీని అర్థిస్తున్నాడు. వయనాడ్ మృత్యుఘోష వీడియోలు ఇవిగో, అర్థరాత్రి చిమ్మచీకట్లో విరుచుకుపడిన కొండచరియలు, 63కు చేరిన మృతుల సంఖ్య
వయనాడ్ తదితర తీరవాసులకు జీవనాడిగా పేరొందిన చలియార్ నది ఇప్పుడు విలయానికి గుర్తుగా మారింది. కొండచరియలకు బలైన వారి మృతదేహాలు ఆరు రోజులైనా ఇంకా నది ప్రవాహంలో కొట్టుకొస్తున్నాయి! ఘటనాస్థలి మీదుగా 40 కి.మీ.ల పొడవునా తీరం వెంట గాలింపు కొనసాగుతోంది. చలియార్ నది కేరళలోని 3 జిల్లాలకు జీవధారగా ఉంది. 169 కిలోమీటర్ల పొడవున్న ఈ నది తరతరాలుగా వయనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల ప్రజలను సుసంపన్నం చేస్తోంది. ఇప్పుడు పలువురిని బలిగొని మృత్యు సాగరమైంది.ఇప్పటివరకూ ఈ నది నుంచి 73 మృతదేహాలను, 132 శరీర భాగాలను వెలికితీసారు.