Rangareddy District Police Use Third Degree On Dalit Woman, CM Revanth Reddy angry over on incident, KTR Slams Congress Govt(X)

Hyd, Aug 5:  రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో ఓ పోలీస్ చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు. ఓ దొంగతనం కేసులో దళిత మహిళను చిత్రహింసలకు గురిచేశాడు. ఏకంగా మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. దీంతో నడవలేక ఆ మహిళ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సీఎం ఆదేశాలతో సీఐ రాంరెడ్డి మీద చర్యలు తీసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్ అవినాష్ మహంతి. ఘటనపై ఏసీపీ రంగస్వామి షాద్‌నగర్‌ విచారణ జరుపుతున్నారని.. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా?, ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన? అని ప్రశ్నించారు కేటీఆర్. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?,నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..! ఇదేం పాలన అని దుయ్యబట్టారు. కొడుకు ముందే చిత్ర హింసలా?, రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా?, ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుందో చెప్పాలన్నారు. ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు ఇది సరికాదని సూచించిన కేటీఆర్...ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో దళితులపై అణచివేత నానాటికీ తీవ్రమవుతోందని ఆరోపించారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణలో మరో మిస్సింగ్ కేసు, ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న బాలుడి కిడ్నాప్?, సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Here's Tweet:

దొంగతనం పేరుతో తొలుత నా భర్తను కొట్టారు. తర్వాత నన్ను తీసుకొని వెళ్లి, చిన్న దుస్తులు తొడిగించారని ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ. మహిళనని కూడా చూడకుండా, చేయని తప్పునకు చిత్రహింసలు పెట్టారని మండిపడింది. షాద్‌నగర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ బృందం పరామర్శించింది.

Here's Video:

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ దళితవాడలో నివాసముండే పీఎంపీ వైద్యుడు నాగేందర్‌ జులై 24న తన ఇంట్లో 22.5 తులాల బంగారం, 2 లక్షలు పోయాయని ఫిర్యాదు చేశాడు. నాగేందర్‌ ఇంటికెదురుగా కూలీ చేసుకునే భీమయ్య, సునీత దంపతుల్ని జులై 26న సీ రాంరెడ్డి విచారణ కోసం స్టేషన్‌కు పిలిచారు. తమకు ఏం తెలియదని చెప్పగా వదలేశారు. తిరిగి 30న రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళను తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారు. దెబ్బలు తాళలేక బాధితురాలు స్పృహ తప్పి పడిపోవడంతో ఇంటివద్ద దింపి వెళ్లారు పోలీసులు. ఇక ఖాకీలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.