Man Toy (Credits: X)

Warsaw, Oct 20: పోలాండ్‌ (Poland) లో ఓ యువకుడు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు. వార్సా (Warsaw) నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తొలుత ఓ షాపింగ్ సెంటర్‌ లోని జువెలరీ షాపులోకి వెళ్లాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్‌ల మధ్య తనూ ఓ బొమ్మలా నిలబడిపోయాడు. కెమెరాల దృష్టి తనపై పడకుండా ఇలా చేశాడు. అతడు కొంచెం కూడా కదలకపోవడంతో షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేకపోయారు.

ICMR Male Contraceptive: పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రత్యామ్నాయంగా మరో విధానం .. ‘ఇంజెక్టబుల్‌ మేల్‌ కాంట్రాసెప్టివ్‌’ను అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్‌.. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ తరహా విధానం.. క్లినికల్‌ ట్రయల్స్‌ సక్సెస్

ఇలా దొరికాడు

షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తరువాత ఓ రెస్టారెంట్‌ కు వెళ్లి సుష్టుగా తిని ఆపై మరో దుస్తుల షాపులో దుస్తులు కూడా చోరీ చేశాడు. కానీ చివర్లో అతడికి దురదృష్టం వెంటాడడంతో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోకతప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.

WhatsApp New Update: త్వరలో ఒకే సిమ్‌ పై రెండు వాట్సాప్‌ ఖాతాలు.. ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వెల్లడి