Hyderabad, Oct 20: పిల్లలు పుట్టకుండా పురుషులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంతాన నియంత్రణ విధానం వ్యాసెక్టమీకి ప్రత్యామ్నాయంగా మరో విధానం అందుబాటులోకి రానున్నది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్-ICMR) ‘ఇంజెక్టబుల్ మేల్ కాంట్రాసెప్టివ్’ (ICMR Male Contraceptive)ను తీసుకువస్తున్నది. ఈ ఇంజెక్షన్ పై క్లినికల్ ట్రయల్స్ 99.02 శాతం సమర్థతతో విజయవంతమయ్యాయి. ఢిల్లీ, ఉదంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్ పూర్ లోని దవాఖానల్లో ఈ ట్రయల్స్ నిర్వహించారు. 25-40 ఏండ్ల మధ్య వయసున్న 303 మందిపై నిర్వహించిన ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాలను ఇంటర్నేషనల్ ఓపెన్ యాక్సెస్ ఆండ్రాలజీ జర్నల్‌లో ప్రచురించారు. ఇంజెక్షన్ సమర్థంగా పనిచేస్తున్నదని, దుష్ప్రభావాలు కూడా పెద్దగా లేవని ట్రయల్స్ లో తేలింది.
#ICMR completes the #ClinicalTrials for the world's first injectable #MaleContraceptive which show that it is safe and highly efficacious without any serious side effects. https://t.co/Jp9i15zD1m
— National Herald (@NH_India) October 19, 2023
దుష్ప్రభావాలు లేవు
పిల్లలు పుట్టకుండా పురుషుల్లో నిరోధించేందుకు వ్యాసెక్టమీ పద్ధతిని ఇప్పటివరకు వినియోగిస్తున్నారు. అయితే అందులోనూ కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. దీంతో కొత్త రకం చికిత్స అవసరం అయింది. ట్రయల్స్ లో తాజా విధానం 99.02 శాతం గర్భం రాకుండా నిరోధించినట్టు పరిశోధకులు గుర్తించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా లేవని వారు తెలిపారు.