Rishi Sunak's Daughter Anoushka Sunak Performs Kuchipudi: యూకే ప్రధాని రిషీ సునాక్ కూతురు కూచిపూడి డ్యాన్స్.. అంతర్జాతీయ కూచిపూడి వేడుకల్లో ప్రదర్శన.. వీడియో ఇదిగో!
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. తొమ్మిదేళ్ల అనౌష్క చాలా మంది పిల్లలతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు.
London, Nov 26: బ్రిటన్ ప్రధాని (Britain Prime Minister) రిషి సునాక్ కూతురు (Daughter of Rishi Sunak) అనౌష్క సునాక్ (Anoushka Sunak) లండన్‌లో (London) జరిగిన ఓ కార్యక్రమంలో కూచిపూడి నృత్య (Kuchipudi Dance) ప్రదర్శన చేసింది. తొమ్మిదేళ్ల అనౌష్క చాలా మంది పిల్లలతో కలిసి కూచిపూడి నృత్యంలో పాల్గొన్నారు. ఆ పిల్లలు అందరూ రేంజ్-ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022 (Range International Kuchipudi Dance Fest 2022) లో పాల్గొన్నారు.
నాలుగేళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ యువతి వీల్ చెయిర్ లోనే డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. యూకే ప్రధాని పదవిని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కృష్ణ సునాక్, అనౌష్క సునాక్.
Watch: Rishi Sunak's Daughter Performs Kuchipudi At UK Event https://t.co/aqRpOgR7te pic.twitter.com/FvZhEKOfHq
— NDTV (@ndtv) November 26, 2022
(The above story first appeared on LatestLY on Nov 26, 2022 10:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

