Geneva, Nov 26: ప్రపంచవ్యాప్తంగా తట్టు కేసులు (Measles Cases) అంతకంతకూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ఈ వైరస్ (Virus) కారణంగా లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ వో) (World Health Organization-WHO) తెలిపింది. తట్టు సోకిన ఓ వ్యక్తి కారణంగా 12 నుంచి 18 మందికి ఈ వ్యాధి సోకొచ్చని హెచ్చరించింది.
In 2021, 2️⃣2️⃣ countries around the globe experienced large and disruptive outbreaks.
This led to over 9 million estimated #measles cases, and 128 000 deaths.
? https://t.co/zw2PuZQB8u pic.twitter.com/yr6pH1fDTY
— World Health Organization (WHO) (@WHO) November 25, 2022
ప్రస్తుత చలి (Monsoon) కాలంలో ఈ కేసులు (Cases) పెరిగే అవకాశమున్నట్టు అంచనా వేసింది. గత ఏడాది లాగా ఈసారి కూడా వైరస్ ప్రభావం పెద్దయెత్తున ఉండనున్నట్టు అభిప్రాయపడింది.
2021లో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది తట్టు సోకినట్టు (Worldwide 90 lakh Cases) డబ్లూహెచ్ వో వెల్లడించింది. 1,28,000 మంది మరణించినట్టు గుర్తు చేసింది. దాదాపు 22 దేశాలు ఈ వైరస్ ప్రభావంతో సతమతం అయినట్టు వెల్లడించింది. వ్యాక్సినేషన్ లేకపోవడం, వైరస్ వ్యాప్తిపై తగిన నిఘా లేకపోవడమే ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణంగా వివరించింది. గత ఏడాది సుమారు 4 కోట్ల మంది చిన్నారులకు తట్టు తీకా వేయించుకోలేదని డబ్లూహెచ్ వో తెలిపింది. ఇందులో 2.5 కోట్ల మంది తొలి డోసు మిస్ అవగా, 1.47 కోట్ల మంది రెండో డోసు వేసుకోలేకపోయారని వెల్లడించింది.
" కరోనా కట్టడికి రికార్డు సమయంలో వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేశారు. చరిత్రలో ఇంతకు ముందు చూడని అతి పెద్ద టీకా కార్యక్రమాలని నిర్వహించారు. అయితే, దీనివల్ల సాధారణ వ్యాక్సిన్ కార్యక్రమాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది పిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించే టీకాలు లభించలేదు. ఇందులో తట్టు కూడా ఉన్నది" అని డబ్లూహెచ్ వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అన్నారు. "వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌లను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడం చాలా క్లిష్టమైనదని పేర్కొన్నారు.
తట్టు అంటువ్యాధి అయినప్పటికీ, టీకా ద్వారా పూర్తిగా దీన్ని నివారించవచ్చు. తట్టుకు సంబంధించి సామూహిక వ్యాప్తిని నిర్మూలించి, పిల్లల్లో రోగనిరోధక శక్తిని సృష్టించడానికి 95% టీకా కవరేజీ లేదా 2 డోసుల వ్యాక్సిన్ అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 81% మంది పిల్లలు మాత్రమే వారి మొదటి తట్టు టీకా పొందారు. 71% మంది మాత్రమే రెండవ షాట్ పొందారు. 2008 నుంచి ఇదే అత్యంత తక్కువ వ్యాక్సిన్ కవరేజీ అని డబ్లూహెచ్ వో వివరించింది.