
Hyderabad, Nov 26: అక్కినేని (Akkineni) వారి మాజీ కోడలు సమంత (Samantha)తో విడిపోయిన తర్వాత అగ్రనటుడు నాగార్జున తనయుడు (Son of Nagarjuna), యువహీరో నాగచైతన్యకు (Naga Chaitanya) సంబంధించి గత కొంతకాలంగా ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.
హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో (Sobhita Dhulipala) చైతూ డేటింగ్ (Dating) చేస్తున్నాడనేదే ఆ వార్త సారాంశం. గతంలో కూడా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా నిన్న ఇద్దరూ కలిసి సమయాన్ని గడిపారు. ఈ సందర్భంగా వారు ఫొటోకు ఫోజు కూడా ఇచ్చారు. ఇప్పడు ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారానికి వీరి తాజా కలయిక మరింత బలాన్ని చేకూర్చింది. మరోవైపు సమంత అభిమానులు చైతూకి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ఒకవైపు సమంత అనారోగ్యంతో బాధపడుతుంటే... నాగచైతన్య కొత్త గర్ల్ ఫ్రెండ్ తో ఆనందంగా గడుపుతున్నాడని విమర్శిస్తున్నారు.