Uttar Pradesh: షాకింగ్..కొడుకు మాజీ భార్యతో కాపురం పెట్టిన తండ్రి, విషయం తెలిసి అవాక్కయిన కొడుకు, రెండో భర్తతో సంతోషంగా ఉన్నానని తెలిపిన కొడుకు మాజీ భార్య, పోలీసుల దగ్గరకు చేరిన పంచాయితీ, యూపీ బదౌన్‌ జిల్లాలో ఘటన
Representational Image (Photo Credits: Unsplash.com)

Lucknow, July 4: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాన్న కోసం కొడుకు వెతికితే అతనికి దిమ్మతిరిగే న్యూస్ తెలిసింది. తన మాజీ భార్యతోనే కాపురం (woman married estranged husband's father) చేస్తున్నాడని తెలిసి అవాక్కయి పోలీసులను (UP Police) ఆశ్రయించాడు. TOI, ZEE వార్తా కథనం ప్రకారం ఈ వైరల్ ఘటన వివరాల్లోకెళితే.. 2016లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదౌన్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు మైనర్ గా ఉన్న సమయంలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే అతను తాగుబోతు (Drinker) కావడంతో ఆమె అతన్ని భరించలేకపోయింది. పైగా రోజు తాగొచ్చి వేధింపులకు గురి చేస్తుండటంతో తట్టుకోలేక అతన్ని వదిలేసి వెళ్లిపోయింది.

కొన్ని రోజులకు ఆ యువతితో ఇక గొడవ పడడని చెప్పాడు. ఉరి పెద్దల మధ్య తన భార్యతో సఖ్యతతో ఉంటానని చెప్పగా అందుకు యువతి ఒప్పుకోలేదు. అతన్ని మాటలు నమ్మశక్యంగా లేవని నేను అతనితో కాపురం చేయలేనని చెప్పి విడాకులు తీసుకుంది. అయితే ఆ యువకుడి జులాయిగా తిరుగుతూ తండ్రి సంపాదన మీద ఆధారపడేవాడు. ఆ యువకుడి తండ్రి సానిటేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అతనే ఇంటి అవసరాలతో పాటు కొడుకుకు కూడా డబ్బులు తనే ఇస్తుండేవాడు. అయితే ఈ మధ్య కొన్ని రోజుల క్రితం తండ్రి కూడా మిస్సయ్యాడు. దీంతో యువకుడు తన తండ్రి కనిపించడం లేదని.. ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయి సాంబల్‌ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకొని వెతికిపెట్టాలని ఆర్‌టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు.

ఖైదీలతో బలవంతంగా సెక్స్, నగ్నంగా వీడియో కాల్స్ చేయాలని బెదిరింపులు, శృంగారం చేసే సమయంలో మిగతా వారు కన్పార్పకుండా చూడాలని కండిషన్, కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైలు అధికారిణి అకృత్యాలు, చివరకు అదే జైలుకు ఖైదీగా..

అయితే తండ్రి జాడ తెలిసిందనగానే (RTI reveals) జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని వారు అందించిన వివరాలు చదువుకున్నాడు. ఆ వివరాలు చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. తన మాజీ భార్యనే యువకుడి నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడని, అక్కడే ఆమెతో కాపురం పెట్టాడని తెలుసుకుని అవాక్కయ్యాడు. వెంటనే బసౌలీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న పోలీసులు జూలై 3న ఇరు వర్గాలను పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు.

వైద్య చరిత్రలో తొలి కేసు..సెక్స్ చేస్తుండగా చీలిపోయిన పురుషాంగం, నిలువుగా చీలడంతో దూరమైన అంగస్తంభనలు, యూకేలో సర్జరీ తర్వాత కోలుకుంటున్న బాధితుడు, ఆరునెలల పాటు శృంగారానికి దూరంగా ఉండాలని వైద్యుల సూచన

అయితే యువకుడి తండ్రి భార్య, అతను మాజీ భార్య ఇందుకు ఒప్పుకోలేదు.. వరుసకు కొడుకు అయ్యే అతనితో నేను కలిసి ఉండలేనని పోలీసులకు తెగేసి చెప్పింది. తన రెండో భర్తతో ఇప్పుడు సంతోషంగా ఉన్నానని.. ఆయన కొడుకుని మా దగ్గరకు పంపొద్దని పోలీసులకు చెప్పింది. పోలీసులకు ఏం చేయాలో అర్థం కాక మరోసారి దీనిపై మాట్లాడదమని చెప్పి వారిని అక్కడినుంచి పంపించేశారు. ఇప్పుడు ఆ యువకుడు తన మాజీ భార్యనే పిన్నిగా పిలవాల్సిన పరిస్థితి ఎదురైంది.