California, July 3: విధి నిర్వహణ పక్కకుపెట్టిన మహిళా అధికారి కామంతో కళ్లు మూసుకుపోయి అనేక దారుణాలకు పాల్పడింది, చివరకు జైలు ఊచలు (Female California corrections officer jailed for sex) లెక్కబెడుతోంది. మూడేళ్ల పాటు జైల్లోనే ఖైదీలతో పాటు డ్యూటీలో ఉన్న అధికారులతో ఆమె బలవంతంగా సెక్స్ చేయించుకునేది. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని చిత్రహింసలకు గురి చేసేది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఖైదీల లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎట్టకేలకు ఆ నిందితురాలికి శిక్ష (Female Prison Officer Jailed For Sex) పడింది. దాదాపు 11 మందితో ఆమె ఈ దారుణాలకు ఒడిగట్టిందని తేలింది.
దారుణ ఘటన వివరాల్లోకెళితే.. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో (Fresno County Jail) టీనా గోన్‌జలెజ్ అనే మహిళ మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా (Female Prison Officer) మూడేళ్లపాటు పని చేసింది. ఆ మూడేళ్ల కాలంలో ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఆమెతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని, ఫోన్ కాల్స్‌లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె (Tina Gonzalez) ఖైదీలను బెదిరించేది. అయితే కొందరు ఖైదీలు ఆమె దారుణాలు తట్టుకోలేక తెగించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వార్తను californianewstimes ప్రచురించింది.
దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసిన అధికారులు.. గత మే నెలలో ఆమెను అరెస్ట్ కూడా చేశారు. దర్యాప్తు కొనసాగిన సమయంలో గోన్‌జలెజ్ జైల్లో ఆమె చేసిన దారుణాలు బయటకు వచ్చాయి. విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు.. ఆ వివరాల్ని జడ్జి ముందు ఉంచారు. ఈ వివరాల్లో ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదని తేలింది.
ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని ఆమె కండిషన్ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన తన యూనిఫాం ప్యాంటులో రంధ్రాలు చేసుకునేదని అధికారులు నివేదిక ఇచ్చారు. ఆరిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు. ఇక గోన్‌జలెజ్ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్ సప్లై చేసేదని, ‘సెక్స్ రిటర్న్ గిఫ్ట్’లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి, ఈ నివేదికను రూపొందించిన స్టీవ్ మెక్‌కోమాస్ కోర్టుకు వెల్లడించాడు. నిందితురాలి తరపున కౌన్సెలర్ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్‌జలెస్ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించండి’ అని వేడుకున్నాడు.
అయితే ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక ‘కామ పిశాచి’గా వర్ణించాడు ‘నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్. మూర్ఖంగా వ్యవహరించావని నేను భావిస్తున్నాను. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు’ అని తీర్పు వెలువరించే ముందు న్యాయమూర్తి మైఖేల్ ఇడియార్ట్ వ్యాఖ్యానించాడు. కాగా, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. ఇప్పటికే జైలులో గడిపినందున.. ఆ శిక్షను మైనస్ చేసి మరో రెండేళ్లు సాధారణ జైలు శిక్ష విధిస్తున్నట్లు జడ్జి వెల్లడించాడు. ఏ జైల్లో అయితే అధికారిణిగా అకృత్యాలకు పాల్పడిందో.. అదే జైలుకి ఇప్పుడామె ఖైదీగా వెళ్లింది.