Bangkok, June 28: థాయ్‌లాండ్‌లో వైరల్ ఘటన చోటు చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పాడనే ప్రతీకారంతో అతని బైకును (woman took revenge on her ex-boyfriend) తగలబెట్టేసింది. దీని ఖరీదు అక్షరాల ఇండియన్ కరెన్సీలో రూ. 23 లక్షల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన సీసీ టీవీ పుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట కొంతకాలం కొంతకాలం బాగా ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ కొనసాగుతున్న సమయంలో లవర్ అయిన కనాక్ వావన్ అనే యువతి తన ప్రియుడికి Rs 23 లక్షల విలువైన బహుమతిని అందించింది. అయితే ఏమయిందో ఏమో కాని ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో తను ఇచ్చి బైక్‌ను తిరిగి ఇవ్వాలని యువతి తన మాజీ ప్రియుడ్ని కోరింది. ఇందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఎలాగైన మాజీ ప్రేమికుడిపై ప్రతీకారం (Woman gets revenge on ex boyfriend) తీర్చుకోవాలనుకుని ఓ ప్లాన్ వేసింది.
బ్యాంకాక్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో ప్రియుడి బైక్ పార్క్ చేసి ఉందని తెలుసుకుంది. అదే అదనుగా అక్కడికి వెళ్లి ఆమె గిఫ్ట్ గా ఇచ్చిన లగ్జరీ బైక్‌ను (Woman Sets Ex-Boyfriend's Bike On Fire) పెట్రోల్ పోసి తగలబెట్టింది.
ఈ క్రమంలో అక్కడ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ మంటలు పక్కనే ఉన్న మరో ఆరు బైక్‌లకు కూడా అంటుకున్నాయి. అక్కడున్న సిబ్బంది వెంటనే తెరుకొని అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అనంతరం సీసీ టీవీఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరిగడానికి ముందు ఓ మహిళ వచ్చి ఓ బైక్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం పోలీసులు గమనించారు.
Watch Video Here:
ఈ ప్రమాదానికి కనాక్ వావన్ కారణమని తెలుసుకొని ఆమెను అరెస్ట్ చేసి విచారించగా మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడే ఆమె కొనిచ్చానని, ఇప్పుడు విడిపోవడంతో అతని మీద కోపంతో ఆ బైక్‌ను తగలబెట్టాలని పోలీసులకు యువతి తెలిపింది.