New Delhi, June 26: అనేక రకాలైన ఫేక్ వార్తలకు సోషల్ మీడియా పుట్టినిల్లుగా మారింది. ఏ వార్త నిజమో మరే వార్త అబద్దమో అనేది తెలియకుండానే చాలామంది వార్తలను నిజమని నమ్మి షేర్ చేస్తున్నారు.అంతే కాకుండా వాటిని వైరల్ చేస్తున్నారు. తాజాగా రూ. 500 నోట్ పై (Rs 500 Note) కూడా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నోట్ మీద గ్రీన్ స్ట్రిప్ గవర్నర్ సంతకం దగ్గర లేదని ఇది మహాత్మాగాంధీ పోటో దగ్గర ఉందని..ఈ నోట్లు (Rs 500 Notes News) ఇక చెల్లవనేది వార్త సారాంశం.
వీటిని ఎవరూ తీసుకోవద్దంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న ఈ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది. ఈ వార్త ఫేక్ అని ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఫ్యాక్ చెక్ (PIB Fact Check ) ద్వారా పీబీఐ తెలిపింది. పీబీఐ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఈ రెండు రకాల నోట్లు పనిచేస్తాయని తెలిపింది.
Here's PIB Fact Check
दावा: ₹500 का वह नोट नहीं लेना चाहिए जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास न होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। @RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं।
अधिक जानकारी के लिए यहाँ जाएं: https://t.co/DuRgmS0AkN pic.twitter.com/2buOmR4iIv
— PIB Fact Check (@PIBFactCheck) June 25, 2021
రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకారం ఈ రెండు నోట్లు చెల్లుతాయని ..గ్రీన్ స్ట్రిప్ ఉన్న నోట్లు ఫేక్ కాదని తెలిపింది. దీనిపై పూర్తి వివరాలు ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. కేంద్రం 2016లో నోట్ల రద్దు ద్వారా కొత్తగా మహాత్మా గాంధీ నోట్ సీరిస్ రూ 500 ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నోట్లు పాత నోట్లు కన్నా చాలా ఢిపరెంట్ గా ఉన్నాయి. కలర్, సైజు, థీమ్, లొకేషన్, సెక్యూరిటీ ఫీచర్లు, డిజైన్ ఎలిమెంట్స్, అన్ని ప్రత్యేకంగా ఉన్నాయి. దీని చుట్టుకొలతల విషయానికి వస్తే.. 66mm x 150mm.
ప్రస్తుతం ఆర్‌బిఐ రూ, 2, 5, 10, 20, 20, 100, 200, 500, 2000 నోట్లను విడుదల చేసింది. కాయిన్స్ విషయానికి వస్తే 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, అయిదు రూపాయలు, 10 రూపాయాలు, 20 రూపాయలను విడుదల చేసింది.