Nellore, July 3: నెల్లూరు జిల్లాలోని పొదలకూరు ఎస్‌బీఐ మేనేజర్ (SPSR nellore podalakur state bank manager nagesh) మహిళలతో చేసిన అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. రుణాల కోసం వచ్చే మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల రికార్డు అయ్యాయి. సీసీ టీవీలో రికార్డు అయిన వీడియో ప్రకారం.. పొదలకూరు ఎస్‌బీఐ మేనేజర్ నగేష్ మహిళా ఖాతాదారులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది. రుణం కోసం వచ్చే మహిళలను మభ్యపెట్టి లోబర్చుకోవడంతో పాటు.. వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి నగేష్ వికృత చేష్టలు సీసీ కెమరాల్లో రికార్డవ్వడంతో (cctv camera behaving rudely with Woman) ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
తోటి ఉద్యోగినిలను కూడా నగేశ్ (Statae Bank Manager Nagesh) తీవ్ర వేధింపులకు గురిచేయగా... ఈ వేధింపులు తాళలేక పలువురు ఉద్యోగినిలు బదిలీపై వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తన వ్యవహారం బయటపెడితే, బ్యాంకులోనే ఆత్మహత్యకి పాల్పడతానంటూ మహిళలు, ఉద్యోగినిలను నగేశ్ బెదిరించినట్లు సమాచారం.
బ్యాంకులోనే ఓసారి నగేశ్‌తో భార్య గొడవకి దిగారని, అతని ఆకృత్యాలని ప్రశ్నించినా తీరు మారనట్లు తెలుస్తోంది. ఏబీఎన్‌లో తన గుట్టురట్టు కావడంతో మేనేజర్ నగేశ్ బ్యాంకుకి వచ్చి వెంటనే వెళ్లిపోయాడు. అయితే ఈ వీడియో గతేడాదిది కాగా తాజాగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరు లీక్ చేశారనే దానిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు.
తాజాగా మహిళా ఖాతాదారులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ సీసీ టీవీ కెమెరాకు చిక్కాడు. మేనేజర్ నగేష్. సీసీటీవీ కెమెరాలోని దృశ్యాలు మీడియా ఛానల్స్‌లో రావడంతో బ్యాంక్ నుంచి జారుకున్నాడు. వీడియో ఆధారంగా కేసులు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పరారీలో ఉన్న నగేష్‌ను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.