Operation Representational Image (Photo Credits: unsplash.com)

London, July 3: యూకేలో మెడికల్ హిస్టరీలోనే జరగని ఓ సంఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తి తన భాగస్వామితో శృంగారంలో పాల్గొన్న సమయంలో అతని పురుషాంగం నిలువుగా (Penis Broke Vertically) చీలిపోయింది. ఈ విష‌యాన్ని బ్రిటీష్ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ (British Medical Journal (BMJ) వెలుగులోకి తీసుకొచ్చింది. కాగా ఇలాంటి కేసు ప్ర‌పంచంలోనే తొలిసారి అని పేర్కొన్న‌ది.

ఘటన వివరాల్లోకెళితే..యూకేకు చెందిన 40 ఏండ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తి త‌న భాగ‌స్వామితో శృంగారంలో పాల్గొన్నాడు. శృంగారం చేస్తున్న స‌మ‌యంలో ఆమె పెరెనియం (perineum – the area between the anus and genitals) భాగంలో పురుషాంగం తీవ్ర రాపిడికి (British man breaks penis vertically) గురైంది. ఆ త‌ర్వాత అంగ‌స్తంభ‌న జ‌రిగిన‌ప్ప‌టికీ, పురుషాంగంలో వాపు క‌నిపించింది. క్ర‌మంగా పురుషాంగం మెత్త‌బ‌డ‌టంతో.. బాధిత వ్య‌క్తి వైద్యుల‌ను సంప్ర‌దించాడు.

వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ నిర్వ‌హించ‌గా.. పురుషాంగం లోపల 3 సెంటిమీట‌ర్ల దూరం నిలువునా చీలిపోయింద‌ని తేలింది. ట్యునికా అల్బుజినియా (tunica albuginea) రెండుగా చీలింది. దీంతో అత‌ని పురుషాంగానికి వైద్యులు స‌ర్జ‌రీ చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. శృంగారం మాత్రం ఆరు నెల‌ల త‌ర్వాత చేయొచ్చని డాక్ట‌ర్లు చెప్పారు. ఆ త‌ర్వాత ఎప్ప‌టి లాగే అంగ‌స్తంభ‌న ఉంటుంద‌ని, ఎలాంటి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావు అని స్ప‌ష్టం చేశారు.

నన్నే వదిలేస్తావా..కోపంతో రూ. 23 లక్షల భాయ్‌ఫ్రెండ్ బైకును పెట్రోలు పోసి తగలబెట్టిన ప్రియురాలు, థాయ్‌లాండ్‌‌లో ఘటన, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ పుటేజ్ వీడియో

కాకపోతే భవిష్యత్ లో ఇటువంటి ఫ్యాక్చర్లు ఎదురైతే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని రీసెర్చర్లు సూచిస్తున్నారు.ఈ గాయం (man breaks penis vertically during sex) అనేది రెగ్యూలర్ గా ఎముకకు అయ్యే గాయం లాంటిది కాదు. దీని చుట్టూ ఎరెక్టికల్ టిష్యూ ఉంటుంది. అది విరిగినప్పుడు ఆ భాగం చుట్టూ వాపు లాంటిది కనిపిస్తుంది. 24గంటల్లోపు ట్రీట్మెంట్ అందించడం చాలా మంచిది. సాధారణంగా సర్జరీ చేసి రక్తస్రావాన్ని తగ్గిస్తారు.

గాంధీ బొమ్మ దగ్గర గ్రీన్ గీత కలిగిన రూ. 500 నోట్ చెల్లదా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్, ఆ వార్త అంతా అబద్దమని నమ్మవద్దంటూ హెచ్చరిక

కాగా పురుషాంగంలో ఎముకలు లేవు కానీ పురుషాంగానికి రక్తాన్ని పంపుతున్న అంగస్తంభన కణజాలం చుట్టూ ఉన్న రక్షణ పొర 'అసాధారణమైన బెండింగ్' కారణంగా దెబ్బతిన్నప్పుడు పురుషాంగం పగులు ఏర్పడుతుంది. కాగా పురుషాంగం పగుళ్లు గతంలో నమోదైన కేసులన్నీ అడ్డంగా ఉన్నాయని వైద్యులు చెప్పారు, అయితే. ఇక్కడ మాత్రం నిలువునా చీలిపోయింది.

బ్యాంకు మేనేజరే కామాంధుడై..లోన్ల కోసం వచ్చే మహిళలపై అసభ్య ప్రవర్తన, సీసీ కెమెరాలో రికార్డయిన పొదలకూరు ఎస్‌బీఐ మేనేజర్‌ నగేష్ వికృత చేష్టలు, బ్యాంకు నుంచి జారుకున్న వైనం

అయితే ఈ సమయంలో రోగికి విరిగినట్లుగా ఎలాంటి శబ్దం తెలియలేదట. అతని అంగస్తంభన కూడా కాలక్రమేణా క్షీణించిందని, ఇలాంటి సందర్భాల్లో అంగస్తంభన సాధారణంగా తక్షణమే పోతుంది. గాయం తర్వాత అతని పురుషాంగం క్రమంగా ఉబ్బిపోతుందని డాక్టర్లు తెలిపారు.