Sister Books An Entire Plane: వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసిన యువతి.. బంధువులు, స్నేహితులను లోహ విహంగంలో తీసుకెళ్లిన వైనం.. వీడియో వైరల్

ఓ జంట వివాహం కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి విమానంలో పెళ్లికి బయలుదేరింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయా షా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.

Sister Books An Entire Plane: వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసిన యువతి.. బంధువులు, స్నేహితులను లోహ విహంగంలో తీసుకెళ్లిన వైనం.. వీడియో వైరల్
Credits: Instagram

Newdelhi, Dec 4: వివాహం (Marriage) అంటేనే ఆడంబరం. అయితే, ఇలాంటి ఆడంబరాన్ని మీరు ఇదివరకు చూసి ఉండరు. అవును. ఓ జంట వివాహం కోసం ఏకంగా విమానాన్నే బుక్ చేసింది ఓ యువతి. కుటుంబ సభ్యులు (Family Members), బంధువులు (Relatives), స్నేహితులతో (Friends) కలిసి విమానంలో (Plane) పెళ్లికి బయలుదేరింది.

మనకూ ‘వందేభారత్’.. సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు.. ఈ నెలలోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. బెర్త్‌ లతో కూడిన రైలు అందుబాటులోకి వచ్చాక విశాఖ వరకు పొడిగింపు

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ శ్రేయా షా ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తన సోదరి వివాహం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత విమానంలోని వారందరినీ చూపించారు. చివర్లో పెళ్లితో ఒక్కటి కాబోతున్న జంటను చూపించారు. శ్రేయా షా చెబుతున్న దాని ప్రకారం ఆ జంట వివాహం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతుంది. ఈ వీడియోను ఇప్పటికే కోటిమందికిపైగా వీక్షించారు.

(The above story first appeared on LatestLY on Dec 04, 2022 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).