File Image (Credits: Twitter/ANI)

Hyderabad, Dec 4: సెమీ హై స్పీడ్ ట్రెయిన్ (Semi-High Speed Train) వందే భారత్ (Vande Bharat) తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు (Runs in Telugu States) పెట్టనుంది. ఇప్పటికే ఐదు వందేభారత్ రైళ్లు పట్టాలు ఎక్కగా ఇది ఆరోది. ఈ రైలులో సీట్లు మాత్రమే ఉంటాయి, బెర్తులు ఉండవు. కాబట్టి తొలుత సికింద్రాబాద్ (Secunderabad)-విజయవాడ (Vijayawada) మధ్య నడపాలనిరైల్వే అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.  మున్ముందు బెర్తులతో కూడిన వందేభారత్ రైళ్లు రానున్నాయి. అప్పుడు విశాఖ వరకు పొడిగించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రతిరోజు 80వేల మందికి వైకుంఠద్వార దర్శనం, .ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ, అన్ని ఆర్జిత సేవలు రద్దు, రూ. 300 టికెట్‌పై వచ్చేవారి సంఖ్యను కూడా పరిమితం చేస్తూ నిర్ణయం

సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో ఈ నెలలోనే ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా  రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. ఈ రైలు గరిష్ఠ వేగం 180 కిలోమీటర్లు. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్న అమరరాజా బ్యాటరీస్, రూ. 9500 కోట్ల భారీ పెట్టుబడితో ఈవీ బ్యాటరీల తయారీ యూనిట్‌ ఏర్పాటు, అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ భరోసా

కాగా, ఈ రైలు ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు రెండు  మార్గాలు ఉన్నాయి. ఒకటి కాజీపేట మీదుగా కాగా, రెండోది నల్గొండ మార్గం.