TTD Formalities for  Vaikunta Ekadasi: ప్రతిరోజు 80వేల మందికి వైకుంఠద్వార దర్శనం, .ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ, అన్ని ఆర్జిత సేవలు రద్దు, రూ. 300 టికెట్‌పై వచ్చేవారి సంఖ్యను కూడా పరిమితం చేస్తూ నిర్ణయం
Tirumala (File Image)

Tirumala, DEC 03: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి (Vaikunta Dwara Darshan) సంబంధించి టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు (Previlage darshan) రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది. అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లపై శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో వివిధ శాఖల అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi), జనవరి 3న వైకుంఠ ద్వాదశి. గత రెండేళ్లుగా అనుసరిస్తున్న విధంగానే జనవరి 11 వరకు పది రోజుల పాటు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేయనున్నారు.

TTD New Decisions: టీటీడీ సంచలనాత్మక నిర్ణయాలు, ఇక నుంచి తిరుపతిలోనే సర్వదర్శనం టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనం టైమింగ్స్ మార్పు, డిసెంబర్ 01 నుంచి అమల్లోకి కొత్త రూల్స్ 

జనవరి 2న తిరుప్పావై, ధనుర్మాస కైంకర్యాల అనంతరం ఉదయం 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రోజుకు దాదాపు 80వేల మందికి దర్శనం కల్పించనున్నారు. ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేసింది. శ్రీవాణి, ఎస్‌ఈడి టిక్కెట్లు, ఎస్ఎస్డి టోకెన్లు కలిగున్న భక్తులకు “మహా లఘు దర్శనం” కల్పిస్తారు. రోజుకు 25వేలు చొప్పున 10 రోజులకు కలిపి 2.50 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 2023 జనవరి కోటాలోనే ఈ టికెట్లు విడుదల చేస్తారు. తిరుమల స్థానికుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన కౌంటర్ తో పాటు తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో రోజుకు 50 వేలు చొప్పున మొత్తం 5 లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తారు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా చూపి ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది.

TTD: శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్యను పెంచిన టీటీడీ, అద‌నపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడు‌దల 

ఎస్‌ఎస్‌డి టోకెన్లు జారీ చేసే తొమ్మిది ప్రదేశాలను రెండు క్లస్టర్‌లుగా విభజించి జెఈఓలు పర్యవేక్షిస్తారు. రోజుకు 2వేల చొప్పున శ్రీవాణి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ప్రతిరోజూ 2వేల మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోబడవు. నూతన సంవత్సరం (New Year), వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దృష్ట్యా డిసెంబర్ 29 నుండి జనవరి 3 వరకు వసతి అడ్వాన్స్ బుకింగ్ రద్దు (Advance Booking) చేస్తారు. గదుల కేటాయింపులో పారదర్శకత పెంచేందుకు మరిన్ని కౌంటర్లు పెంచి సిఆర్వోలో మాత్రమే కేటాయిస్తారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 2న తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుంది. జనవరి 3వ తేదీన వైకుంఠ ద్వాదశి రోజున స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ స్నపనం అనంతరం చక్రస్నానం చేస్తారు. అన్ని కార్యక్రమాలను ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.