Tirumala, Feb 23: ఈ నెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేయనున్నట్టు తెలిపింది. బుధవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అయితే ఈసారి శ్రీవారి దర్శన టికెట్ల (Slotted Sarva Darshan (SSD) Tokens) సంఖ్యను టీటీడీ పెంచింది. ఈ నెల 24 నుంచి అదనపు కోటా కింద 13 వేల దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రోజుకు 25 వేలకు పెంచింది.
ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను టీటీడీ (Tirumala Tirupati Devasthanams) తాత్కాలికంగా నిలిపివేసింది. పేమెంట్ గేట్‌వే వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో టిక్కెట్లు కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది. సాంకేతిక సమస్యను పరిష్కరించిన అనంతరం ఉదయం 11 గంటలకు టిక్కెట్ల కేటాయింపు ప్రకియ తిరిగి ప్రారంభంకానుంది.
ఇప్పటి వరకు 61 వేల టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. ఫిబ్రవరి, మార్చికు సంభందించి 8 లక్షల 40 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే.