Yuzvendra Chahal Viral Video: భయమేస్తుంది నన్ను వదిలేయ్ తల్లీ రెజ్లర్ ను వేడుకున్న టీమిండియా క్రికెటర్, వైరల్ గా మారిన వీడియో ఇదుగోండి!
ఫోగట్ చాహల్ ను భుజాలపైకి ఎత్తుకొని గిరగిరా తిప్పింది. చాహల్ బక్కపలచగా ఉండటంతో సంగీత ఫోగట్ తేలిగ్గా తన భుజాలపైకి ఎత్తికుంది. గిరగిరా రెండురౌండ్లు తిప్పింది. ఆందోళనతో చాహల్ ‘నన్ను వదిలేయ్ తల్లీ.. నేను దిగిపోతా’ అన్నట్లుగా ఫోగట్ ను వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ యింది.
Mumbai, March 03: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన ఇన్ స్టాగ్రామ్ లో నిత్యం వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటాడు. టీ20 స్పెషలిస్ట్ గా పేరుపొందిన చాహల్ ఏడాది క్రితం టీమిండియాలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల బీసీసీఐ విడుదల చేసిన సెంట్రల్ కాంట్రాక్ట్ లోనూ అతడు స్థానం కోల్పోయాడు. దీంతో లెగ్ స్పిన్నర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలాఉంటే తాజాగా చాహెల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ వీడియోలో చాహల్ ‘భయమేస్తుంది నన్ను వదిలేయ్ తల్లీ అంటూ రెజ్లర్ ను వేడుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు సరదా సరదా కామెట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో యుజ్వేంద్ర చాహెల్ ను స్టార్ రెజ్లర్ సంగీత ఫోగట్ (Sangeeta Phogat) భుజాలపైకి ఎత్తుకొని గిరగిరా తిప్పింది.
View this post on Instagram
చాహల్ భార్య ధనశ్రీ వర్మ డ్యాన్సర్ అని తెలిసిందే. ఆమె ఝలక్ దిఖ్‌లా జా డాన్స్ షో 11వ ఎడిషన్ ఫైనల్ చేరింది. అయితే, ఈ డాన్స్ షో నిర్వాహకులు ఏర్పాటు చేసిన పార్టీలో ఫోగట్ చాహల్ ను భుజాలపైకి ఎత్తుకొని గిరగిరా తిప్పింది. చాహల్ బక్కపలచగా ఉండటంతో సంగీత ఫోగట్ తేలిగ్గా తన భుజాలపైకి ఎత్తికుంది. గిరగిరా రెండురౌండ్లు తిప్పింది. ఆందోళనతో చాహల్ ‘నన్ను వదిలేయ్ తల్లీ.. నేను దిగిపోతా’ అన్నట్లుగా ఫోగట్ ను వేడుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ యింది.
(The above story first appeared on LatestLY on Mar 03, 2024 05:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

