Dhanush's Kubera Leaked Video: ధనుష్ కుబేర మూవీ నుంచి లేటెస్ట్ వీడియో లీక్, ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుందంటూ..

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush) టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో D51గా తెరకెక్కుతున్న మూవీ కుబేర. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు.

New Visuals From Dhanush's Kubera Leaked Watch Video

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ (Dhanush) టాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల (Shekhar Kammula) దర్శకత్వంలో D51గా తెరకెక్కుతున్న మూవీ కుబేర. కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. అక్కినేని నాగార్జున (Nagarjuna) కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ముంబైలో భారీ షెడ్యూల్‌లో ధనుష్‌, రష్మిక మందన్నాపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.కుబేరలో షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రోప్‌ వేలతో షూట్‌ చేస్తున్నట్టు వీడియో ద్వారా అర్థమవుతోంది. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది.. అనే క్యాప్షన్‌తోపాటు ధనుష్ చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న కుబేర ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

ఈ మూవీని ఏషియన్‌ సినిమాస్‌ బ్యానర్‌పై సునీల్ నారంగ్‌, పీ రామ్‌మోహన్‌ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కుబేర ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధనుష్‌ దీంతోపాటు స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ రాయన్‌ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Here's Video and pics

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement