Bigg Boss Season-7 Promo: త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్-7... ప్రోమో విడుదల.. ఫుల్ ప్యాకేజీ ఎంటర్టయిన్ మెంట్ తో వస్తున్నామన్న స్టార్ మా
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో పలకరించనుంది.
Hyderabad, July 11: తెలుగు బుల్లితెరపై (Telugu Small Screen) బిగ్ బాస్ రియాలిటీ షో (Bigg Boss Reality Show) కొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో త్వరలోనే 7వ సీజన్ తో (Seventh Season) పలకరించనుంది. ఈ కార్యక్రమ ప్రసారకర్త స్టార్ మా చానల్ (Star Maa Channel) తాజాగా బీబీ7 ప్రోమో విడుదల చేసింది. రెడీగా ఉండండి... ఎమోషన్ల ఎత్తుపల్లాల్లో మిమ్మల్ని ఉర్రూతలూగించడానికి బిగ్ బాస్ తెలుగు సీజన్-7 వచ్చేస్తోంది అని స్టార్ మా చానల్ పేర్కొంది. మరిన్ని సర్ ప్రైజ్ లు, మరిన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్... సిల్లీ ఫైట్స్ నుంచి హృదయాలు బరువెక్కించే గాథల వరకు... సంపూర్ణ వినోదం గ్యారెంటీ అని మేం మీకు హామీ ఇస్తున్నాం అని వివరించింది. ఆ ప్రోమో మీరూ చూడండి.
#BiggBossTelugu7 - A Full Package of Entertainment ! Get ready to be hooked as BB7 Telugu takes you on a rollercoaster ride of emotions, surprises, and thrilling moments that will leave you wanting more. Coming Soon Only on @StarMaa & @DisneyPlusHSTel pic.twitter.com/ow2mnabHxJ
— Starmaa (@StarMaa) July 10, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 11, 2023 09:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

