Bhopal, July 11: మధ్యప్రదేశ్ (Madhyapradesh) మూత్ర విసర్జన (Urination) ఘటన కొత్త మలుపు తిరిగింది. ఓ గిరిజనుడిపై పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం (Urine) పోసిన ఘటనతో చలించిపోయిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బాధితుడిని ఇంటికి పిలిపించుకుని కాళ్లు కడిగి శాలువా కప్పారు. క్షమించమని వేడుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి కాళ్లు కడిగింది బాధితుడు దశ్మత్ రావత్ కు కాదంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. దీంతో సీఎంతో కాళ్లు కడగించుకున్న ఆ వ్యక్తి ఎవరన్న ప్రశ్న తలెత్తింది. మరోవైపు, సోషల్ మీడియా (Social Media) కూడా బాధితుడు, సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి ఒకరు కాదని చెబుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ‘సుధామ’గా పేర్కొంటున్నారు.
Sidhi Peeing Incident: Did MP CM Shivraj Chouhan wash someone else's feet?#ShivrajChouhan #SidhiPeeingIncident
— Zee News English (@ZeeNewsEnglish) July 10, 2023
వయసులో తేడా
మూత్ర విసర్జనకు సంబంధించిన వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి వయసు 16-17 ఏళ్లకు మించి ఉండవని, సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి వయసు 35-38 మధ్య ఉంటుందని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఈ విషయంపై ఇవే ఆరోపణలు చేసింది. అయితే, ఈ వాదనను బీజేపీ ఖండించింది.