Hyderabad, July 11: పాతబస్తీవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రో రైలు (Metro Train) త్వరలో అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-ఫలక్ నుమా (MGBS-Falaknuma) మార్గంలో మెట్రో మార్గాన్ని నిర్మించాలంటూ మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ (Metro Connectivity) రాగా.. పాతబస్తీలో ప్రాజెక్టుకు సంబంధించి అవాంతరాలు ఎదురయ్యాయి. సుమారు ఆరు ఏడు సంవత్సరాలుగా ఈ మార్గంలో 5.5 కిలోమీటర్ల మేర మెట్రోపనులు ముందుకు కదలలేదు. మెట్రో కోసం పెద్ద సంఖ్యలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి రావడమే కారణం. మరో మార్గంలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు సర్వే నిర్వహించినా పరిస్థితిలో పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మిగిలిన మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా కోరారు.
It’s Official: KCR gives nod to 5.5-km long Old City Hyderabad Metro Rail #metroproject #OldCity #KCR https://t.co/t0gbwQY3nu
— NewsMeter (@NewsMeter_In) July 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)