Delhi: అజిత్ ధోవల్ నివాసంలోకి అగంతకుడు, తన శరీరంలో చిప్‌ను పెట్టారని, దాని ద్వారా తనను కంట్రోల్ చేస్తున్నట్లు పోలీసులకు వెల్లడి
దేశ రాజధానిలోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కారులో వచ్చిన వ్యక్తి నేరుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూర్టీ అతన్ని అడ్డుకున్నది.
దేశ రాజధానిలోని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కారులో వచ్చిన వ్యక్తి నేరుగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న సెక్యూర్టీ అతన్ని అడ్డుకున్నది. ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన స్పెషల్ సెల్ అతన్ని విచారిస్తున్నది. ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ఆ వ్యక్తి మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తోంది. కిరాయి కారుతో ఆ వ్యక్తి ధోవల్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. తన శరీరంలో చిప్‌ను పెట్టారని, దాని ద్వారా తనను కంట్రోల్ చేస్తున్నట్లు ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)