Saif Ali Khan Attack Case: సైఫ్ అలీఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్... నిందితుడిని పట్టుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, తేల్చిచెప్పిన ముంబై పోలీసులు
బాంద్రా పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్న వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి కాదని..వేరే కేసుకు సంబంధించిన వ్యక్తి అని తెలిపారు ముంబై పోలీసులు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే దీనిని ఖండించారు ముంబై పోలీసులు.
బాంద్రా పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్న వ్యక్తి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి కాదని..వేరే కేసుకు సంబంధించిన వ్యక్తి అని తెలిపారు ముంబై పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేదని తెలిపారు.
తన ఇంట్లో జరిగిన దొంగతనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ అలీఖాన్‌ను ఆరుచోట్ల కత్తితో పొడిచి గాయపడ్చాడు ఓ దుండగుడు. దీంతో సైఫ్‌ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా ప్రస్తుతం కోలుకున్నారు. సైఫ్ పై దాడిని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. 10 బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన అనుమానితుడిని పట్టుకున్న పోలీసులు..బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఇంటరాగేషన్, వీడియో ఇదిగో
Mumbai police says No one is detained in Saif Ali Khan Attack Case