2024 భారతదేశం ఎన్నికలు: రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరిన ప్రధాని మోదీ, కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపు
దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్ (Polling) జరుగుతోంది.ఈ సందర్భంగా యువకులు, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వారు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోరారు.
2024 భారతదేశం ఎన్నికలు: దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్ (Polling) జరుగుతోంది.ఈ సందర్భంగా యువకులు, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వారు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోరారు. ‘2024 లోక్‌సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తొలివిడతలో భాగంగా వివిధ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తప్పక ఓటు వేయాలి’’ అని మోదీ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. గత పదేళ్ళ గాయానికి మీ ఓటుతో చికిత్స చేయండి, మీ శక్తిమంతమైన ఓటుతో ద్వేషాన్ని ఓడించి ప్రేమ దుకాణాలు తెరవాలని పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ
మొదటి దశ ఎన్నికలకు వెళ్తున్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. తమిళనాడులో 39 స్థానాలు, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలు, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండేసీ స్థానాలు, ఛత్తీస్ గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతుంది.
Here's Modi Tweet
The 2024 Lok Sabha elections commence today! As 102 seats across 21 States and UTs go to the polls, I urge all those voting in these seats to exercise their franchise in record numbers. I particularly call upon the young and first time voters to vote in large numbers. After all,…
— Narendra Modi (@narendramodi) April 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 19, 2024 02:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

