2024 భారతదేశం ఎన్నికలు: దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్ (Polling) జరుగుతోంది. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు. ప్రతి ఓటూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కోయంబత్తూరులో ఓటు హక్కును వినియోగించుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్, వీడియో ఇదిగో..
ఈ పదేళ్లలో దేశ ఆత్మపై జరిగిన గాయాలపై మీ ఓటుతో మందు పూయాలని చెప్పారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. మీ ప్రతి ఓటు భారతదేశ ప్రజాస్వామ్యాన్నే కాకుండా తరతరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.
Here's Rahul Gandhi Tweet
आज पहले चरण का मतदान है!
याद रहे, आपका एक-एक वोट भारत के लोकतंत्र और आने वाली पीढ़ियों का भविष्य तय करने जा रहा है।
इसलिए बाहर निकलिए और पिछले 10 साल में देश की आत्मा को दिए गए ज़ख्मों पर अपने ‘वोट का मरहम’ लगाकर लोकतंत्र को मज़बूत कीजिए।
नफ़रत को हरा कर खोल दीजिए हर कोने… pic.twitter.com/A9lfRb6yh2
— Rahul Gandhi (@RahulGandhi) April 19, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)