రెండు చేతులు లేకున్నా కాలు బొటన వేలితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాడు ఓ యువకుడు(Telangana MLC Elections). ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ పాషాకు పుట్టకతోనే రెండు చేతులు లేవు. దీంతో తన కాలు బొటన వేలితో పాషా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాడు.

ఇక తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పట్టభద్రుల స్థానంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 4 గంటల లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతం పోలింగ్ జరుగగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 80 శాతం పోలింగ్ దాటింది. ఇక ఖమ్మంలో పోలింగ్ శాతం 80 దాటింది.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్, మూడు స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య గట్టి పోటీ నెలకొంది. విజయం ఎవరిని వరిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Young Man Without Arms Casts Vote Using Toe in Graduate MLC Elections

రెండు చేతులు లేకున్నా కాలు బొటన వేలితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన యువకుడు..

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)