Pond Stolen in Bihar: ఇదేందయ్యా.. ఇది?? దొంగతనానికి గురైన చెరువు.. బీహార్ లో షాకింగ్ ఘటన.. రాత్రికి రాత్రే నీళ్లు తోడేసి గుడిసెను నిర్మించిన భూమాఫియా
బీహార్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్భంగా జిల్లాలో రాత్రికి రాత్రే ఒక చెరువు దొంగతనానికి గురయ్యింది. తెల్లారే సరికి నీళ్లు ఉన్న ప్రదేశంలో ఒక గుడిసె వెలిసింది.
Patna, Jan 1: బీహార్ లో (Bihar) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్భంగా (Darbhanga) జిల్లాలో రాత్రికి రాత్రే ఒక చెరువు దొంగతనానికి (Stolen) గురయ్యింది. తెల్లారే సరికి నీళ్లు ఉన్న ప్రదేశంలో ఒక గుడిసె వెలిసింది. కొందరు కబ్జాదారులు చెరువులోని నీళ్లను తోడి ఇసుకతో నింపారు. ఆ ప్రదేశంలో గుడిసెను నిర్మించారు. రాత్రంతా ట్రక్కులు, యంత్రాల పనులు నిర్వహిస్తుండడంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కబ్జా ఎవరు చేశారో తెలియదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దర్భాంగ డీఎస్పీ కుమార్ తెలిపారు.
Pond 'stolen' in Bihar overnight, hut constructed on it by land mafia https://t.co/p5UCqy15Gq
— IndiaToday (@IndiaToday) December 31, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 2024 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

