Hyderabad, DEC 31: కొత్త సంవత్సరం కదా.. ఎలా పడితే అలా ప్రవర్తించొచ్చు, తిరిగేయొచ్చు అనుకుంటున్నారా? ఫుల్లుగా మద్యం సేవించి వాహనాలు (Drunk And Drive) నడిపేయాలని భావిస్తున్నారా? మనల్ని అడ్డుకునేది ఎవరు? అని అతి విశ్వాసంతో ఉన్నారా? అయితే బీకేర్ ఫుల్. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అంతేకాదు జేబుకి చిల్లు కూడా పడుతుంది. నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా తెలంగాణ పోలీసులు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా మందుబాబుల కిక్కు దించేయనున్నారు. తాగి వాహనాలు నడిపే వారి తాట తీయనున్నారు. జైలు శిక్ష (Prision) వేయడం, భారీగా ఫైన్లు విధించడంతో పాటు వాహనాలు కూడా సీజ్ చేస్తారు.
ఆలోచించండి... ఆదమరచక.. ఆచరించండి... అలవాట్లను అదుపులో పెట్టుకోండి.
మద్యం మత్తులో చిత్తై వాహనాన్ని నడిపి బాధించకండి... బాధితులు కాకండి.#DriveSafe@AddlCPTrfHyd pic.twitter.com/i8EwPQ1kIf
— Hyderabad Traffic Police (@HYDTP) December 31, 2023
న్యూఇయర్ (New Year) నేపథ్యంలో రాత్రి 8గంటల నుంచే పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ (Drunk And Drive), డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు. వారి బండిని సీజ్ చేస్తారు. అంతేకాదు 10వేలు ఫైన్ విధిస్తారు. అలాగే 6 నెలలు జైలు శిక్ష పడుతుంది. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లను డీజీపీ కార్యాలయం అలర్ట్ చేసింది. ఇక న్యూఇయర్ వేడుకలు అర్థరాత్రి ఒంటిగంట దాటాక కూడా కొనసాగిస్తే కేసులు నమోదు చేయాలని సూచించింది. అటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు.
“Don’t let one night of fun turn into a lifetime of guilt.”
Don't Drink & Drive, Stay Safe.#DriveSafe #DontDrinkAndDrive #ArriveAlive #RoadSafety #SaveLives #Salaar #HyderabadCityPolice pic.twitter.com/e8HYJN5la7
— Hyderabad City Police (@hydcitypolice) December 30, 2023
అటు ఏపీలోనూ పోలీసులు (Police) అలర్ట్ అయ్యారు. న్యూఇయర్ వేడుకల దృష్ట్యా రూల్స్ తీసుకొచ్చారు. నూతన సంవత్సర వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే వారంతా పోలీసు శాఖ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ ఆదేశించారు. నిర్వాహకులు వేడుకలు జరిగే ప్రదేశంలో లోపలికి వెళ్లే మార్గంతో పాటు బయటకు వచ్చే మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజే స్పీకర్ల శబ్దం 45 డెసిబుల్స్ మించకూడదని స్పష్టం చేశారు. బాణసంచా కాల్చడం, సామర్ధ్యానికి మించి పాసులు, టికెట్లు జారీ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లను పబ్ లోకి అనుమతిస్తే కేసు నమోదు చేస్తామన్నారు.
Welcome Newyear safely. Do not drink and drive. Heed to the message of @hydcitypolice pic.twitter.com/g2UPmWkLGj
— Kothakota Sreenivasa Reddy, IPS (@CPHydCity) December 31, 2023
ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం వరకే మద్యం విక్రయించాలని, అగ్నిమాపక శాఖ అధికారుల సలహాలు పాటించాలని సూచించారు. వీటన్నింటిని కస్టమర్లకు తెలిసేలా వేడుకలు జరిగే ప్రాంతంలో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇక రాత్రి 10 గంటల నుంచి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు.