ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ, అగ్రస్థానంలో కొనసాగుతున్న కేన్ విలియమ్సన్, బౌలింగ్ ర్యాంకుల్లో నెంబర్ వన్ గా అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో జో రూట్, మూడో స్థానంలో స్టీవ్ స్మిత్, నాలుగో స్థానంలో డారిల్ మిచెల్ (న్యూజిలాండ్), ఐదో స్థానంలో బాబర్ అజామ్ ఉన్నారు. ఇటీవల టీమిండియాతో తొలి టెస్టులో భారీ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ ఓల్లీ పోప్ ఒక్కసారిగా 20 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ నాపై ఉమ్మేశాడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు, ఆ తర్వాత మందు తాగుతూ సారీ చెప్పాడని వెల్లడి
ఐసీసీ విడుదల చేసిన టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడా రెండో ర్యాంకుకు దూసుకొచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా 4, రవీంద్ర జడేజా 5వ స్థానంలో ఉన్నారు.
ఐసీసీ టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో టీమిండియా ఆటగాళ్లు కొనసాగుతున్నారు. నెంబర్ వన్ గా రవీంద్ర జడేజా, నెంబర్ టూగా రవిచంద్రన్ అశ్విన్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అక్షర్ పటేల్ ఒక స్థానం పతనమై ఆరో ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మన్ జో రూట్ ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి ఎగబాకడం విశేషం.
Here's ICC Tweet