తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ తన తండ్రి ఎవరో ప్రపంచానికి చెప్పిన దాఖలాలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితిలో ఆయన ఉన్నారన్నారు. తాను వైఎస్, విజయమ్మల తనయుడినని సీఎం జగన్ గర్వంగా చెప్పుకుంటారన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి జగన్ ఓ లక్షసార్లు తన తల్లిదండ్రుల గురించి చెప్పుకున్నారన్నారు.

కానీ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడానికి సిగ్గుపడే చంద్రబాబు.. జగన్ గురించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. ఇప్పుడు ఎవరిది దౌర్భాగ్యమైన బతుకు, ఎవరిది దౌర్భాగ్యమైన స్థితో చెప్పాలన్నారు.తల్లిదండ్రులు చనిపోతే తలకొరవి పెట్టనివాడు, జుత్తు తీయనివాడు చంద్రబాబు అన్నారు. ఈ రోజుకు తాను రామారావు అల్లుడినని చెప్పుకుంటారు తప్ప... పలానా వ్యక్తి కొడుకును అని చెప్పుకోలేని వ్యక్తి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు.

Perni Nani

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)